‘ఫార్మాట్​తో సంబంధం లేకుండా మెరుగవ్వాలి’

ఫార్మాట్​తో సంబంధం లేకుండా క్రికెట్​లో తన ఆటను మెరుగుపరుచుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపాడు ఆస్ట్రేలియా మిడిలార్డర్​ బ్యాట్స్​మన్​​ లబుషేన్​. వన్డేల్లో తన బౌలింగ్​ నైపుణ్యాన్ని కూడా పెంపొందించుకుంటానని వెల్లడించాడు.

“మనం బాగా ఆడాలని కోరుకుంటే ఫార్మాట్​తో సంబంధం లేదు. వన్డేల్లో నా ఆటతీరు ఇప్పుడిప్పుడే మెరుగవుతోంది. నా బౌలింగ్​ స్థిరంగా ఉండేలా చూడాలి. దీనివల్ల బ్యాటింగ్​లో విఫలమైనా.. బౌలింగ్​ ద్వారా మిడిల్ ఓవర్లలో కెప్టెన్​కు ఉత్తమ ఎంపికగా ఉండాలనుకుంటున్నా. దాని కోసం మరింత సాధన చేయాలి. అలాంటి నైపుణ్యాలను నాలో వృద్ధి చేసుకోవడానికి ఇంకా ఐదు నెలల సమయం ఉండటం చాలా ఆనందంగా ఉంది. మనకున్న సమయాన్ని తెలివిగా ఉపయోగించడంపైనే మన ఆటతీరు పూర్తిగా ఆధారపడి ఉంటుంది”.

– లబుషేన్​, ఆస్ట్రేలియా బ్యాట్స్​మన్​

జట్టులో నాయకత్వ లక్షణాల గురించి లబుషేన్​ వద్ద ప్రస్తావించగా..”నాయకుడిగా ఉండటానికి నేను ఇష్టపడతా. కానీ, అది ఇప్పుడు అవసరమని నేను అనుకోను. నా పని కేవలం ఆస్ట్రేలియా తరపున నిలకడగా ఆడుతూ పరుగులు సాధించడమే” అని తెలిపాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This