పాలు అమ్ముతూ.. కూలీ పనులు చేస్తూ

వాళ్లూ బ్లూ జెర్సీ వేసుకునే క్రికెటర్లే అయినా, వాళ్లూ భారత్​కే ఆడుతున్నా.. వాళ్ల జీవితాలు మిగతా భారత క్రికెటర్లలా కాదు. జీవనం సాగడమే కష్టంగా ఉన్న వీల్​ఛైర్​ క్రికెటర్లు.. బీసీసీఐ ఎప్పుడు తమను ఆధీనంలోకి తీసుకుంటుందా అని ఎదురుచూస్తున్నారు.

వ్యవసాయ కూలీగా..

వీల్​ఛైర్​ క్రికెట్లో భారత వికెట్​ కీపర్​ నిర్మల్​ సింగ్​ దిల్లాన్​ది పంజాబ్​లోని మోగా. అతడు పాలు అమ్మడాన్ని జీవనోపాధిగా ఎంచుకుంటే.. ఫాస్ట్​బౌలర్​ సంతోష్​ రంజగానె కొల్హాపూర్​లోని వెల్డింగ్​ దుకాణంలో పనిచేస్తున్నాడు. లాక్​డౌన్​ కారణంగా వ్యాపారాలన్నీ మూతపడడం వల్ల అతడు వ్యవసాయ కూలీగా మారాడు. రోజుకు వచ్చేది రూ.150 రూపాయలే. వీళ్లంతా ఇటీవల కాలంలో మంచి విజయాలు సాధించిన భారత వీల్​ఛైర్​ జట్టు సభ్యులే. కానీ బీసీసీఐ పరిధిలో లేకపోవడం వల్ల ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు.

కమిటీ ఏర్పాటుకు సిఫార్సు

లోధా కమిటీ సూచించిన సంస్కరణల ప్రకారం దివ్యాంగ క్రికెటర్ల అభివృద్ధి కోసం బీసీసీఐ ఓ కమీటీని ఏర్పాటు చేయాల్సిఉంది. కానీ బీసీసీఐ ఇప్పటివరకు ఆ పని చేయలేదు. ఈ విషయంపై బోర్డు అధ్యక్షుడు సౌరవ్​ గంగూలీ.. భారత వీల్​ఛైర్​ క్రికెట్​ సంఘం ముఖ్య కార్యనిర్వహణాధికారితో చర్చలు కూడా జరిపాడని వీల్​ఛైర్​ జట్టు కెప్టెన్​ సోమ్​జీత్​ సింగ్​ తెలిపాడు.

గంగూలీ హామీ ఇచ్చారు

“దివ్యాంగ క్రికెటర్లకు సంబంధించిన కమిటీ ఏర్పాటుపై బీసీసీఐ నుంచి మాకు ఎలాంటి సమాచారమూ లేదు. సహాయం చేస్తానని గంగూలీ హామీ ఇచ్చాడు” అని సోమ్​జీత్​ చెప్పాడు. 24 ఏళ్ల సోమ్​జీత్ ఉత్తరప్రదేశ్​లో తొలిసారి వీల్​ఛైర్​ క్రికెటర్ల సంఘం ఏర్పాటులో, ఆ తర్వాత స్క్వాడ్రన్​ లీడర్​ అభయ్​ ప్రతాప్​ సింగ్​తో కలిసి జాతీయ సంఘం ఏర్పాటులో కీలకపాత్ర పోషించాడు. వీల్​ఛైర్​ క్రికెటర్లతో పాటు అంధ, బధిర క్రికెటర్లు కూడా బీసీసీఐ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This