87 ఏళ్ల చరిత్రలో తొలిసారి ‘రంజీ’ టోర్నీ రద్దు

భారత క్రికెట్​ నియంత్రణ బోర్డు(బీసీసీఐ).. ప్రీమియర్ ఫస్ట్​-క్లాస్​​ దేశవాళీ క్రికెట్​ టోర్నమెంట్​ అయిన రంజీ ట్రోఫీని ఈ దఫా నిర్వహించట్లేదని ప్రకటించింది. 87 ఏళ్ల రంజీ చరిత్రలో ట్రోఫీని నిర్వహించకపోవడం ఇదే మొదటిసారని బీసీసీఐ స్పష్టం చేసింది. కొవిడ్​ నేపథ్యంలో.. మెజార్టీ రాష్ట్రాల క్రికెట్​ అసోసియేషన్లు విజయ్​ హజారే ట్రోఫీ నిర్వహణకు మొగ్గు చూపడమే దీనికి కారణం.

దీంతోపాటు అండర్​-19 వన్డే, వినూ మన్కడ్​ ట్రోఫీ, మహిళల పరిమిత ఓవర్ల టోర్నమెంట్లనూ జరుపుతామని బీసీసీఐ స్పష్టం చేసింది. కరోనా మార్గదర్శకాలు పాటిస్తూ రెండు నెలల పాటు రంజీ ట్రోఫీని నిర్వహించడం సాధ్యం కాదని పేర్కొంది.

అంతకుముందు.. దేశవాళీ టోర్నీల నిర్వహణ అంశంపై రాష్ట్రాల క్రికెట్​ అసోసియేషన్లు అభిప్రాయాలు తెలుపాల్సిందిగా.. బీసీసీఐ కార్యదర్శి జై షా లేఖలు రాశారు. ముస్తాక్​ అలీ టోర్నీని విజయవంతంగా నిర్వహించడంపైనా ఆయన హర్షం వ్యక్తం చేశారు. వివిధ రాష్ట్రాల క్రికెట్​ అసోసియేషన్లకు కృతజ్ఞతలు తెలిపారు.

కాగా, గతేడాది జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్లో బంగాల్​, సౌరాష్ట్రలు తలపడ్డాయి. విజేతగా సౌరాష్ట్ర నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This