2020: రిటైర్మెంట్​ ప్రకటించిన క్రికెటర్స్​ వీరే!

అప్పటివరకు సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడి, వైవిధ్యమైన బౌలింగ్​తో ఆకట్టుకుని, స్టన్నింగ్​ క్యాచులతో అదరగొట్టిన క్రికెటర్లు.. అకస్మాత్తుగా క్రికెట్​కు వీడ్కోలు పలికారంటే ఏ అభిమానికి మాత్రం బాధలేకుండా ఉంటుంది. తమ అభిమాన ఆటగాడు మైదానంలో దుమ్మురేపుతున్నప్పుడు వచ్చే ఆనందం, కేరింతలు, ఈలలు అన్ని మూగబోతాయి. మొత్తానికి రిటైర్మెంట్​ ప్రకటించడమంటే ఓ ఆటగాడికి తన జీవితంలోనే అతి పెద్ద సవాల్ లాంటిది. అయినా ప్రతి ఏడాది ఎవరో ఒక క్రికెటర్ ఆటకు గుడ్​బై చెప్తూనే ఉంటారు. అలానే ఈ ఏడాది కూడా చాలా మంది గొప్ప ఆటగాళ్లు క్రికెట్​కు వీడ్కోలు పలికారు. మరి వారెవరో ఓసారి చూద్దాం.

ధోనీ

మహేంద్ర సింగ్​ ధోనీ.. క్రికెట్ ప్రపంచంలో విజయవంతమైన సారథుల్లో ఒకడు. తన కెప్టెన్సీలో మూడు ప్రపంచకప్​ల్లోనూ భారత్​ను విజేతగా నిలిపాడు. ఎప్పుడూ ప్రశాంత స్వభావంతో మెలిగే మహీ.. తన రిటైర్మెంట్​ను కూడా ఆగస్టు 15వ తేదీన చాలా సింపుల్​గా ఓ చిన్న సందేశం ద్వారా తెలిపి అందరినీ షాక్​కు గురిచేశాడు. మొత్తంగా కెరీర్​లో 350 వన్డేలు(10,073 పరుగులు), 90టెస్టులు(4876 పరుగులు), 98టీ20(1617 పరుగులు) ఆడాడు.

సురేశ్​ రైనా

సురేశ్​ రైనా కూడా ధోనీ రిటైర్మెంట్​ ప్రకటించిన రోజే ఆటకు వీడ్కోలు పలికాడు. కెరీర్​లో 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20లు ఆడి.. 7988 పరుగులు చేశాడు. మరోవైపు ఐపీఎల్​లో చెన్నై సూపర్​ కింగ్స్​కు ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు.. లీగ్​ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కొనసాగుతున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This