‘టీ20 ప్రపంచకప్​ భారత్​లో కష్టమే’

వచ్చే ఏడాది భారత్​లో టీ20 ప్రపంచకప్ నిర్వహించడంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోందని అన్నారు పీసీబీ సీఈఓ వసీమ్​ ఖాన్. దేశంలో కరోనా ఉద్ధృతి కారణంగా.. ఈ టోర్నీని యూఏఈకి బదిలీ చేసే అవకాశముందని అభిప్రాయపడ్డారు. భారత్​లో జరగబోయే ఇంగ్లాండ్ సిరీస్, ఐపీఎల్ 14వ సీజన్​​ నిర్వహణపై వచ్చే ఏడాది ఏప్రిల్​ నాటికి స్పష్టత వస్తుందని వెల్లడించారు. 2022లో ఆసియా ప్రపంచకప్​నకు ఆతిథ్యమిచ్చేందుకు తాము హక్కులను సొంతం చేసుకున్నట్లు స్పష్టం చేశారు.

అలాగే ప్రపంచకప్​లో పాల్గొనే పాకిస్థాన్‌ ఆటగాళ్లకు భారత్ వీసాలు మంజూరు చేసేలా లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని ఐసీసీ, బీసీసీఐని కోరారు. కాగా, భవిష్యత్తులో భారత్​-పాక్​ మధ్య ద్వైపాక్షిక సిరీస్​లు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This