కోవిడ్‌ నుంచి వాతావరణ మార్పుల దాకా..

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలకు సవాళ్లు విసురుతున్న నేపథ్యంలో సంపన్న దేశాల కూటమి  జీ–7 సదస్సు యూకేలోని కార్నవాల్‌లోని కార్బిస్‌ బే హోటల్‌లో ఈనెల 11 నుంచి 13 తేదీ వరకు జరగనుంది. సముద్రం ఒడ్డున ఉన్న ఒక గ్రామంలో, ప్రశాంతంగా ఉండే రిసార్ట్‌లో ఆతిథ్య దేశం యూకే ఈ సదస్సుని ఏర్పాటు చేసింది. అమెరికా, యూకే, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్‌ సభ్య దేశాలుగా ఉన్న జీ–7 సదస్సు ఈసారి కోవిడ్‌పై యుద్ధం, వాతావరణంలో మార్పులపైనే ప్రధానంగా చర్చించనుంది. ఈ సదస్సులో పాల్గొనడం కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇప్పటికే ఇంగ్లండ్‌కు చేరుకున్నారు. బైడెన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు ఇదే మొదటి విదేశీ పర్యటన. ఇక జర్మనీ చాన్సలర్‌ ఎంజెలా మెర్కెల్‌ కూడా పదవీ బాధ్యతలు స్వీకరించాక తొలిసారి విదేశీ పర్యటనకు వచ్చారు. ఈ ఏడాది జీ–7 సదస్సుకి అతిథి దేశాలుగా భారత్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా దేశాలను ఆహ్వానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This