చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోండి

కరోనా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కె. తారక రామారావు సూచించారు. ఈ విషయంలో గతంలో ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని సమర్థవంతంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలను కలుపుకొని వెళ్లాలని కోరారు. ఇప్పటిదాకా ఉద్దీపన ప్యాకేజీని ఎక్కడ ఖర్చు పెట్టారో తెలియదని, రాష్ట్రాల్లో విపక్ష, స్వపక్ష ప్రభుత్వాలు అనే తేడా లేకుండా మేకిన్‌ ఇండియా నినాదాన్ని కలసికట్టుగా ముందుకు తీసుకెళ్దామని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీహెచ్‌ఆర్‌డీ)లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ వార్షిక నివేదిక 2020–21ను మంత్రి కేటీఆర్‌ గురువారం విడుదల చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This