కాంగ్రెస్​ సీనియర్​ నేత అహ్మద్​ పటేల్​ కన్నుమూత

కాంగ్రెస్​ సీనియర్​ నేత, గుజరాత్​కు చెందిన రాజ్యసభ సభ్యుడు అహ్మద్​ పటేల్​ (71).. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ మేరకు ఆయన కుమారుడు ఫైజల్​ ట్విటర్​ ద్వారా వెల్లడించారు. బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచినట్లు తెలిపారు. నెల రోజుల క్రితం కరోనా బారిన పడి.. పలు అవయవాలు దెబ్బతిన్నట్లు చెప్పారు.

71 ఏళ్ల పటేల్​ తాను కొవిడ్​ బారిన పడినట్లు అక్టోబర్​ 1న ట్విటర్​ ద్వారా తెలిపారు. అనంతరం నవంబర్​ 15న ఆసుపత్రిలో చేరారు. కొద్ది రోజులుగా ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This