సీఎం హామీతో గుర్జర్ల ఆందోళనల విరమణ

రిజర్వేషన్​ వ్యవహారంలో రాజస్థాన్​లో ఆందోళనలు చేస్తున్న గుర్జర్లు.. ఎట్టకేలకు శాంతించారు. ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​తో చర్చల అనంతరం రైల్వే ట్రాక్​లను ఖాళీ చేసి నిరసనలు ముగించారు. ఫలితంగా నేటి నుంచి రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగనున్నాయి.

“ప్రభుత్వంతో బుధవారం రాత్రి చర్చలు జరిగాయి. సీఎం సూచనలకు సంఘం అంగీకరించింది. రైల్వే ట్రాక్​లను ఖాళీ చేస్తున్నాం. ఆందోళనలను విరమిస్తున్నాం”

— విజయ్​ బైంస్లా, గుర్జర్​ నాయకుడు

గుర్జర్ల డిమాండ్​లివే..

  • రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్​ ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం గుర్జర్లకు రిజర్వేషన్లు కల్పించాలి.
  • ఖాళీల బ్యాక్​లాగ్​లను త్వరితగతిన భర్తీ చేసి, పెండింగ్​లో ఉన్న నియామక ప్రక్రియలో అత్యంత వెనుకబడిన తరగతుల(ఎంబీసీ) వారికి 5శాతం రిజర్వేషన్​ ఇవ్వాలి.
  • 14 పాయింట్ల ఒప్పందం ప్రకారం.. ప్రొబేషన్​ పీరియడ్​ పూర్తి చేసుకున్న 1,252 మంది ఉద్యోగులకు రెగ్యులర్​ పే స్కేల్​ ఆధారంగా వేతనాలివ్వాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This