దర్శకుడు రేప్ చేశాడని​ టీవీ నటి ఆరోపణ

తనపై లైంగిక దాడి జరిగిందని హిందీ టీవీ నటి, పోలీసులను ఆశ్రయించింది. కాస్టింగ్​ డైరెక్టర్​ ఆయుష్​ తివారీ.. తనపై అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. ఈ విషయమై సెక్షన్​ 376 కింద అతడిపై ముంబయిలోని వెర్సోవా పోలీసు స్టేషన్​లో కేసు నమోదైంది.

వివాహం చేసుకుంటానని మభ్యపెట్టి, గత రెండేళ్లుగా తనపై అత్యాచారం చేశాడని సదరు నటి, ఫిర్యాదులో పేర్కొన్నట్లు వెర్సోవా​ పోలీసు అధికారి వెల్లడించారు. నవంబరు 26న కాస్టింగ్​ డైరెక్టర్​పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రాథమిక దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This