ఎక్కడున్నా ఫర్లేదు.. కలిసి సినిమా చూసేయండి!

కరోనా వ్యాప్తి నేపథ్యంలో థియేటర్లన్నీ బంద్​ అయిపోయాయి. వినియోగదారులకు సినిమాలు చూడాలని ఆశగా ఉన్నా… బిగ్​ స్క్రీన్​పై విడుదల చేసే అవకాశం లేదు. అయితే వీక్షకులకు వినోదం పంచుతూ వారితో టచ్​లో ఉంటున్నాయి ఓటీటీ వేదికలు. వీటితో వెండితెరపై చూసిన అనుభూతి రాకపోయినా… సగటు ప్రేక్షకుడికి చలనచిత్రాలు దగ్గరవుతున్నాయి. కొంత మేరకు మానసిక ఉపశమనం కలిగిస్తున్నాయి. అయితే ఓటీటీలో ఇప్పటివరకు ఉన్న ఓ సమస్యకు సరికొత్త పరిష్కారాన్ని తీసుకొచ్చింది అమెజాన్​ ప్రైమ్​.

కలిసే చూడొచ్చు..

దూరంగా ఉన్న స్నేహితుడితో కలిసి సినిమా చూడాలంటే ఓటీటీ వేదికపై కష్టం. అయితే అందుకోసం ఓ ఫీచర్​ను తీసుకొచ్చింది అమెజాన్​ ప్రైమ్​ సంస్థ. ‘వాచ్​ పార్టీ’ పేరుతో వచ్చిన ఈ ఆప్షన్​తో.. వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నా కుటుంబ సభ్యులు, మిత్రులు అంతా కలిసి ఒకే టీవీ షో లేదా సినిమా చూడొచ్చు. దాదాపు 100 మంది స్నేహితులు కలిసి చూస్తూనే చాటింగ్​ చేసుకోవచ్చు.

ఇలా పనిచేస్తుంది..?

చూడాలనుకున్న షో లేదా వీడియో పక్కన వాచ్​ పార్టీ ఫీచర్​ ఉంటుంది. దానితో రూం క్రియేట్​ చేసి.. లింక్​ను స్నేహితులతో షేర్​ చేసుకోవాలి. ఇలా 100 మంది వరకు ఒకేసారి ఈ సినిమా చూడొచ్చు. అయితే ప్రైమ్​ మెంబర్​ షిప్​ ఉన్నవాళ్లనే యాడ్​ చేయడం కుదురుతుంది. ప్రస్తుతం ఇది అమెరికాలోనే అందుబాటులో ఉండగా… త్వరలో ప్రపంచవ్యాప్తంగా విస్తరించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This