‘ఫేస్ షీల్డ్’తో రొమాన్స్​ చేసిన ఆ హీరో

కరోనా ప్రభావంతో ఇకపై రానున్న సినిమాల్లో ముద్దు, శృంగార సన్నివేశాల విషయంలో దర్శకనిర్మాతలు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో హీరో ఆయుష్మాన్​ ఖురానా సోదరుడు అపర్​శక్తి ఖురానా ఇన్​స్టాలో పోస్ట్ చేసిన ఓ ఫొటో నవ్విస్తూనే ఆలోచింపజేస్తోంది. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

రొమాన్స్​కు ‘ఫేస్​షీల్డ్’!

అపర్​శక్తి తొలిసారి హీరోగా నటిస్తున్న సినిమా ‘హెల్మెట్’. ఇందులో భాగంగా హీరోయిన్ ప్రనూతన్ కళ్లలోకి చూస్తూ, మంచంపై ఉన్న స్టిల్​ను పంచుకున్నాడు అపర్​శక్తి. దీనితో పాటే తామిద్దరి ముఖాలకు ‘ఫేస్ షీల్డ్’ ఎడిటింగ్​ చేసిన మరో ఫొటోను పోస్ట్ చేశాడు. “హమ్మయ్యా మా సినిమా షూటింగ్ కరోనా రాకముందు జరిగింది. ఒకవేళ ఇప్పుడు ఇదే సన్నివేశాన్ని చిత్రీకరించాలంటే ఫేస్ షీల్డ్ తప్పనిసరేమో!” అంటూ రాసుకొచ్చాడు.

ప్రస్తుతం చంఢీగడ్​లో కుటుంబంతో ఉన్న అపర్​శక్తి.. పాటలు పాడుతూ అభిమానులతో టచ్​లో ఉన్నాడు. దీనితో పాటే ‘తేరీ యారీ’ అనే గీతం కోసం మిలింద్ గబా, కింగ్ కాజీలతో కలిసి పనిచేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This