‘ఆరోజు ఇంకా గుర్తుంది.. నువ్వు లక్షల్లో ఒక్కడివి’

అల్లు అర్జున్‌, మంచు మనోజ్‌, అనుష్క కీలక పాత్రల్లో క్రిష్‌ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘వేదం’. 2010 జూన్‌ 4న విడుదలై, నేటితో పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం వీడియోకాల్‌ ద్వారా ముచ్చటించుకున్నారు. బన్నీ, అనుష్క, మనోజ్‌, క్రిష్‌, కీరవాణి, నిర్మాతలు శోభు, ప్రసాద్‌లు ఆనాటి సంగతులను గుర్తు చేసుకున్నారు.

“వేదం’ రూపొందడానికి కారణమైన నీకు ధన్యవాదాలు. ఓ స్టార్‌ హీరో అయినా సరే ఐదు పాత్రల్లో ‘కేబుల్‌ రాజు పాత్ర నేను పోషిస్తా’ అని నువ్వు చెప్పిన ఆ రోజు ఇప్పటికీ నాకు గుర్తుంది. థ్యాంక్యూ మై ఫ్రెండ్‌. నువ్వు లక్షల్లో ఒక్కడివి” అని అల్లు అర్జున్​ను ఉద్దేశించి క్రిష్‌ పేర్కొన్నారు. అదేవిధంగా మంచు మనోజ్‌కు ధన్యవాదాలు చెప్పారు. దీంతో పాటు ఇతర కీలక పాత్రధారులకు కృతజ్ఞతలు చెబుతూ ఓ భావోద్వేగ ట్వీట్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This