అలరిస్తోన్న ‘ద గర్ల్ ఆన్ ది ట్రైన్’ క్యారెక్టర్ పోస్టర్స్

బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా హీరోయిన్​గా నటించిన చిత్రం ‘ద గర్ల్ ఆన్ ది ట్రైన్’. ఇటీవలే టీజర్​ను విడుదల చేసిన చిత్రబృందం తాజాగా చిత్రంలోని పాత్రలతో కూడిన పోస్టర్లను ప్రేక్షకుల ముందుంచింది. థ్రిల్లర్​ కథతో తెరకెక్కిన ఈ చిత్రం.. నెట్​ఫ్లిక్స్​లో ఫిబ్రవరి 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది. రిబు దాస్​గుప్తా దర్శకత్వం వహించారు.

ఈ చిత్రంలో పరిణీతితో పాటు అదితీ రావు హైదరి, కృతి కుల్హారి, అవినాష్ తివారీ కీలకపాత్రల్లో నటించారు. లండన్​లో ఓ పోలీస్ ఆఫీసర్​గా కృతి కనిపించనుండగా, అవినాష్​.. పరిణీతికి భర్తగా అలరించనున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This