చిరును మోహన్​బాబు అందుకే కలిశారా?

డైలాగ్​ కింగ్​ మోహన్‌బాబు కథానాయకుడిగా… దేశభక్తి ప్రధానంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’. డైమండ్‌ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో మెగాస్టార్​ చిరంజీవి అతిథి పాత్రలో కనిపించబోతున్నారని తెలిసింది.

ఇటీవల ‘ఆచార్య’ సెట్​లో చిరును కలిశారు మోహన్​బాబు. ఈ సందర్భంగా వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయ్యాయి. అయితే ఈ భేటిలో… తన సినిమాలో నటించమని చిరుకు మోహన్​బాబు విజ్ఞప్తి చేశారని సమాచారం. ఒకవేళ ఈ ప్రతిపాదనకు మెగాస్టార్​ గ్రీన్​ సిగ్నల్​ ఇస్తే.. ‘సన్​ ఆఫ్​ ఇండియా’కు మరో ప్రత్యేక ఆకర్షణ అవుతుంది. చిరంజీవి నటించిన ఎన్నో సినిమాల్లో డైలాగ్​ కింగ్​ విలన్‌గా నటించారు. కామెడీతో కూడిన విలనిజంతో ఆకట్టుకున్నారు. వీరిద్దరు కలిసి నటించిన ఆఖరి చిత్రం ‘కొదమసింహం’.

‘సన్​ ఆఫ్​ ఇండియా’ సినిమాను శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. విష్ణు మంచు నిర్మాత.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This