వివాదాన్ని సృష్టించి చర్చలకు రమ్మంటోన్న చైనా!

తూర్పు లద్ధాఖ్​లోని గల్వాన్​ లోయకు.. దశాబ్దాలుగా స్థిరమైన స్థానముందని భారత్​ చెబుతోంది. ఇక్కడ చైనాతో ఎలాంటి సరిహద్దు వివాదం లేదని ప్రకటిస్తూ వస్తోంది. అయితే ఎప్పుడూ లేనివిధంగా శుక్రవారం.. చైనా కొత్త అనిశ్చితికి తెరతీసింది. గల్వాన్​, షాయోక్​ నదీ సంగమ ప్రాంతంపై ప్రాదేశిక సార్వభౌమాధికారాన్ని ప్రకటించింది. ఇక్కడ ఎన్నో ఏళ్లుగా తాము గస్తీ నిర్వహిస్తున్నామని అబద్ధాలు చెబుతోంది.

కొన్ని రోజులుగా వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు దేశాలు భారీగా బలగాలను మోహరించాయి. విమానాలు, ఆర్టిలరీ గన్స్​తోపాటు భారీ వాహనాలను తరలించాయి. తూర్పు, పశ్చిమ తీరాల్లో భారత నావికాదళం కూడా అప్రమత్తమైన నేపథ్యంలో అనూహ్యంగా గల్వాన్​ లోయ తమదేనని వాదన ప్రారంభించింది చైనా.

ఏప్రిల్​ నుంచి కొనసాగుతున్న సరిహద్దు వివాదంలో చైనా చేసిన ఈ ప్రకటన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. వివాదాన్ని రాజేస్తూనే పరిష్కారానికి చర్చలకు ప్రతిపాదనలు చేసింది చైనా. సైనిక కమాండర్ స్థాయి చర్చలు జరగాల్సిందేనని పట్టుబడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This