ఓ వైపు ప్రతిష్టంభన.. మరోవైపు సంప్రదింపులు!

వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్​-చైనా దళాలు సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. రేజంగ్​ లా శిఖరం వద్ద ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వార్త ప్రాధాన్యం సంతరించుకుంది.
శాంతిమంత్రం…మరోవైపు తూర్పు లద్దాఖ్​లో కాల్పుల కలకలంపై మాటల యుద్ధం కొనసాగుతున్న తరుణంలో చైనా శాంతి జపాన్ని మొదలుపెట్టింది. ఉద్రిక్తతలను తగ్గించేందుకు సాధ్యమైనంత త్వరగా బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తికావాలని ఆశాభావం వ్యక్తం చేసింది. పరస్పర చర్చల ద్వారా ఇది సాధ్యపడుతుందని పేర్కొంది. శీతాకాలం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇరు పక్షాలకు ఇదే మంచిదని వెల్లడించింది.చైనా దూకుడు…మే నెల నుంచి సరిహద్దులో భారత్​పై కయ్యానికి కాలుదువ్వుతోంది చైనా. జూన్​ 15న గల్వాన్​ లోయలో హింసాత్మక ఘటనకు పాల్పడింది. ఆ తర్వాత జరిగిన చర్చలతో పరిస్థితులు కొంతమేర సద్దుమణిగాయి. అయితే గత నెల చివరి వారంలో.. చైనా మరోమారు ఆక్రమణకు పాల్పడటం వల్ల పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. సోమవారం సాయంత్రం భారత సైనిక శిబిరమే లక్ష్యంగా చైనా దాడికి ప్రయత్నించడం వల్ల ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This