చైనా బాగోతం బట్టబయలు- వుహాన్ మార్కెట్లో ఆధారాలు ధ్వంసం

వుహాన్​లో కరోనావైరస్​ తొలిదశలో ఉన్నప్పుడే గుర్తించిన హాంకాంగ్​కు చెందిన మైక్రోబయాలజిస్ట్, సర్జన్, ప్రొఫెసర్ క్వాక్​ యంగ్​ యుయెన్.. చైనా బాగోతాన్ని బట్టబయలు చేశారు. వైరస్​ను గుర్తించి దానిపై​ దర్యాప్తు చేసేందుకు వెళ్లగా.. అప్పటికే హువానాన్​ జంతు మార్కెట్​లోని భౌతిక ఆధారాలన్నింటినీ ధ్వంసం చేశారని చెప్పారు.

ప్రముఖ వార్తా సంస్థ బీబీసీతో మాట్లాడిన ఆయన.. అప్పటికే గుర్తించిన క్లినికల్ ఆధారాలపై అధికారులు ఆలస్యంగా స్పందించారని పేర్కొన్నారు.

“మేం హువానన్ సూపర్​ మార్కెట్​కి వెళ్లినప్పుడు అక్కడేమీ లేదు. అప్పటికే పూర్తిగా శుభ్రం చేసి ఉంది. మార్కెట్ శుభ్రంగా ఉంది కాబట్టి క్రైం జరిగిన ప్రాంతం చెదిరిపోయిందని మీరు అనుకోవచ్చు. మనుషులకు వైరస్​ వ్యాప్తి చేసే ఒక్క హోస్ట్​ను కూడా మేం అక్కడ గుర్తించలేదు. అక్కడేదో కప్పిపుచ్చడానికి వుహాన్​లోని స్థానిక అధికారులు ప్రయత్నించినట్లు నేను కూడా అనుమానిస్తున్నాను. సమాచారాన్ని వెంటనే పంపాల్సిన స్థానిక అధికారులు అలా జరిగేలా చేయలేదు.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This