‘2021 తొలినాళ్లలోనే చంద్రయాన్​-3 ప్రయోగం’

భారత్​ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న చంద్రయాన్​-3 ప్రయోగం 2021 తొలినాళ్లలోనే చేపట్టే అవకాశం ఉందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్​ తెలిపారు. అయితే.. చివరి క్షణంలో విఫలమైన చంద్రయాన్​-2 మాదిరిగా ఇందులో ఆర్బిటర్​​ ఉండదని తెలిపారు. ల్యాండర్​, రోవర్​లు ఉంటాయన్నారు.

“జాబిల్లిపై ఇస్రో తొలి ప్రయోగం చంద్రయాన్​-1ను 2008లో చేపట్టింది. అది చంద్రుడి ధ్రువాల వద్ద తుప్పు పడుతున్నట్లు చిత్రాలను పంపింది. దాంతో చంద్రుడిపై ఇనుముతో కూడిన రాతినేల ఉందని తేలినప్పటికీ.. అక్కడ నీరు, ఆక్సిజన్​ ఉన్నట్లు ఇంకా తెలియదు. చంద్రుడి ధ్రువాల వద్ద తుప్పు జాడలు కేవలం భూమి వాతావరణం కారణంగానే జరుగుతున్నట్లు నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. చంద్రయాన్​-1 సమాచారం ప్రకారం జాబిల్లి ధ్రువాల వద్ద నీటి జాడలు ఉన్నట్లు తెలుస్తోంది. దానిని తెలుసుకునేందుకే శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. ల్యాండింగ్​ సమయంలో సమస్య తలెత్తి విఫలమైన చంద్రయాన్​-2 మాదిరిగానే ఈ ప్రాజెక్టు ఉన్నప్పటికీ.. ఇందులో ఆర్బిటర్​ ఉండదు. మరోవైపు.. భారత్​ తొలిసారిగా చేపడుతోన్న మానవ సహిత గగన్​యాన్​ ప్రాజెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వ్యోమగాములకు శిక్షణ సహా ఇతర పనులు కొనసాగుతున్నాయి.”

– జితేంద్ర సింగ్​, కేంద్ర మంత్రి

2019, సెప్టెంబర్​లో ల్యాండింగ్​ సమయంలో సమస్య తలెత్తి చంద్రయాన్​-2 విఫలమైన తర్వాత.. మూడో మిషన్​ ప్రయోగాలకు ప్రణాళికలు రచించింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. ఈ ఏడాది చివరి నాటికి ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, కరోనా మహమ్మారి కారణంగా పలు ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం పడి.. వాయిదా వేయాల్సిన పరిస్థితి తలెత్తింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This