పేదల సంక్షేమంలోనూ అవినీతికి పాల్పడటం దారుణం: చంద్రబాబు

ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్స్​లను వైకాపా ప్రభుత్వం ప్రచారానికి వాడుకుంటోందని తెదేపా అధినేత చంద్రబాబు తప్పుబట్టారు. 90 శాతం మందిని అనర్హులుగా చేయడమే.. 90 శాతం హామీలు నెరవేర్చడమా.. అని ప్రశ్నించారు. కుప్పం తెదేపా నాయకులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైకాపా అవినీతి కుంభకోణాలు, మోసాలను ప్రజల్లో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. వైకాపా పతనం ప్రారంభమైనందునే తప్పుడు కేసులు, బెదిరింపులు, వేధింపులతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రజల ప్రాణాల కన్నా.. పార్టీ ప్రచారంపైనే సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టారని చంద్రబాబు విమర్శించారు. తల్లి గర్భంలో నుంచి జీవితాంతం వరకు వైద్యం, విద్య, ఉపాధి, పౌష్టికాహారం తదితర సంక్షేమ పథకాలను అందజేసిన ఘనత తెలుగుదేశానిదేనని స్పష్టం చేశారు. వైకాపా పాలనలో.. స్కాముల కోసమే స్కీములు పెడుతున్నారని.. పేదల సంక్షేమంలోనూ అవినీతికి పాల్పడటం హేయమని చంద్రబాబు మండిపడ్డారు. ఇళ్ల పట్టాల్లో, కరోనా కిట్లు, అంబులెన్స్​, బ్లీచింగ్​లోనూ అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This