ప్రతి రూపాయిపై 800 వచ్చాయ్​!

‘రెండున్నర దశాబ్దాల క్రితం (1994లో) అదానీ ఎంటర్​ప్రైజెస్​ పబ్లిక్​ ఇష్యూకు వచ్చింది. ఆ సమయంలో వాటాదార్లు పెట్టిన ప్రతి రూపాయి పెట్టుబడి 800 రెట్లు పెరిగింద’ని అదానీ గ్రూపు ఛైర్మన్​ గౌతమ్​ అదానీ అన్నారు. తన మౌలిక సదుపాయాల దిగ్గజ గ్రూపు ఎన్నో విభాగాల అనుసంధాన సంస్థగా అవతరించిందని జేపీ మోర్గాన్​ ఇండియా సదస్సులో ‘ఫ్యూచర్​ ఇన్​ ఫోకస్’ అంశంపై మాట్లాడుతూ ఆయన చెప్పారు.

‘ఓడరేవులు.. విమానాశ్రయాలు, ఇంధనం.. ఇలా కొత్త వ్యాపారాలను ప్రోత్సహించాలన్న మా విధానం ఆరు నమోదిత సంస్థలను సృష్టించింది. వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలను కల్పించింది. వాటాదార్ల విలువను అనూహ్యంగా పెంచింద’ని ఆయన అన్నారు. కళాశాల చదువును మధ్యలోనే ఆపేసిన గౌతమ్​ అదానీ తొలుత కమొడిటీస్​లో ట్రేడింగ్​ చేశారు. అనంతరం భారత్​లోనే అతి పెద్ద రేవు సంస్థను అభివృద్ధి చేశారు. అనంతరం భారత్​లోనే అతి పెద్ద ప్రైవేట్​ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థగాను ఈ గ్రూప్​ రూపాంతరం చెందింది. ఇంధనం, గనులు, గ్యాస్​, పునరుత్పదక విద్యుత్​ రక్షణ, వ్యవసాయ కమొడిటీలు.. ఇలా పలు విభాగాల్లోకి విస్తరించింది.

‘మేం ముఖ్యంగా​ వస్తువులు, ఎలక్ట్రానిక్స్​, ప్రజలు, సమాచారం… ఇలా పలు వాటిని చేరవేసే మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశాం. భారత్​లో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో మా వంతు సహకారం అందించటంపై దృష్టి పెట్టడమే ధ్యేయమ’ని ఆయన అన్నారు. ప్రపంచంలో రెండో దిగ్గజ ఆర్థిక వ్యవస్థగా 2050కి భారత్​ అవతరిస్తుందని గౌతమ్​ అదానీ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This