బస్సు బోల్తా.. 12 మందికి తీవ్ర గాయాలు

మధ్యప్రదేశ్​ శివపురి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్​ వైపు వెళ్తున్న ఓ బస్సు.. ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.

గ్వాలియర్​ జిల్లాలోని దాద్రా నుంచి అహ్మదాబాద్​ వైపు 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న క్రమంలో కొలారస్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు ప్రమాదం గురించి తెలుసుకున్న సమీప గురుద్వారాలోని పలువురు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకువారిని బయటకు తీశారు. అనంతరం కొలారస్​ పోలీసులు స్పందించి.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడంలో తోడ్పడ్డారు.

గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమించటం వల్ల శివపురి జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This