నిర్మల నయా ట్రెండ్​- ‘ట్యాబ్’​తో బడ్జెట్​

వార్షిక బడ్జెట్​ ప్రతులను సూట్​కేస్​లో తీసుకొచ్చే సంప్రదాయానికి స్వస్తి పలికిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​.. ఈసారి ఎర్రటి రంగు పౌచ్​లో ట్యాబ్​తో పార్లమెంట్​కు వచ్చారు. కరోనా నేపథ్యంలో బడ్జెట్​ ప్రతుల ముద్రణ లేనందున ట్యాబ్​ ద్వారా డిజిటల్​ పద్ధతిలో బడ్జెట్​ ప్రవేశపెట్టనున్నారు.

ఎన్డీఏ సర్కారు 2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత.. తొలిసారి బడ్జెట్​ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్​.. సూట్​కేస్​ సంప్రదాయానికి తెరదించుతూ.. ఎర్రటి వస్త్రంలో బడ్జెట్​ ప్రతులను తీసుకొచ్చారు. ఆ తర్వాత ఏడాది 2020లోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగించారు. ఈసారి కరోనా నేపథ్యంలో.. ఎర్రటి వస్త్రానికీ స్వస్తిపలికి అదే రంగులోని పౌచ్​లో ట్యాబ్​ను తీసుకొచ్చారు.

సూట్​కేస్​ చరిత్ర ఇదీ..

బడ్జెట్​ను ఫ్రెంచ్​ భాషలో బోగెటి అంటారు. దీని ఇంగ్లీష్​ అర్థమే లెదర్​ బ్యాగ్​. 1860లో బ్రిటన్ మొదటి ఆర్థిక మంత్రి విలియం ఎవర్ట్ గ్లాడ్​స్టోన్ మొదట లెదర్ బ్యాగ్​లో పత్రాలు తీసుకొచ్చి బడ్జెట్ ప్రవేశపెట్టారు. అలా ఆయనతో మొదలైన సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది.

బ్రిటిష్​ సంప్రదాయాన్ని స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన వాళ్లూ కొనసాగిస్తూ వచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థను నడిపే శక్తి ఈ లెదర్​ సూట్​కేసులో ఉంటుంది. అందుకే.. మంత్రి చేతిలో ఉండే ఈ సూట్​కేసును ప్రత్యేకంగా పరిగణిస్తారు. అయితే.. ఆ బ్రీఫ్​కేసును తెచ్చే సంప్రదాయం మారకపోయినా.. దాని రంగులు మాత్రం మారుతూ వచ్చాయి.

ఈ సూట్​కేసులను ఆర్థిక మంత్రిత్వ శాఖనే సేకరిస్తోంది. విభిన్న రంగుల్లోని నాలుగు బ్యాగ్​లను ఆర్థిక మంత్రి ముందు ఉంచుతుంది. వాటిలో నచ్చిన రంగును ఎంచుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This