కరోనాతో ప్రముఖ సంగీత దర్శకుడు మృతి

బాలీవుడ్​ ప్రముఖ సంగీత ద్వయం సాజిద్-వాజిద్​లలో ఒకరైన వాజిద్ ఖాన్.. ఆదివారం రాత్రి(మే 31) మరణించారు. 42 ఏళ్ల వాజిద్.. గత కొన్నాళ్లుగా గుండె, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. దీనితో పాటే ఇటీవలే కరోనా బారిన పడ్డారు. ముంబయిలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈయన మృతిపై బాలీవుడ్​ స్టార్స్ సంతాపం తెలుపుతున్నారు. ఈ వార్త తమను షాక్​కు గురిచేసిందని రాసుకొస్తున్నారు.

సహచర మ్యూజిక్​ డైరెక్టర్​ సలీమ్​ మర్చంట్, వాజిద్ మరణవార్తను ముందుగా తన ట్విట్టర్​లో పంచుకున్నారు. అనంతరం ప్రియాంక చోప్రా, వరుణ్ ధావన్, సోనూ నిగమ్, పరిణితి చోప్రా, విశాల్ దద్లానీ తదితరులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

సాజిద్-వాజిద్.. ఇటీవలే విడుదలైన సల్మాన్​ఖాన్ లాక్​డౌన్​ గీతాలు ‘భాయ్ భాయ్’, ‘ప్యార్ కరోనా’లకు సంగీతమందించారు. వీరంటే సల్మాన్​కు చాలా అభిమానం. ఈ కథానాయకుడు నటించిన ‘ప్యార్ క్యా తో డర్నా క్యా’ సినిమాతోనే సాజిద్-వాజిద్.. సినీ కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత కాలంలో సోనీదే నకరే(పార్టనర్, 2007), జాల్వా(వాంటెడ్, 2009), సురులీ అకియోన్ వాలే(వీర్, 2010), మున్నీ బద్నామ్ హుయి(దబాంగ్, 2010) సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. దిగ్గజ తబాలా ప్లేయర్ ఉస్తాద్ షరాఫత్ హుస్సేన్ ఖాన్ కుమారుడే వాజిద్ ఖాన్.​

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This