బైడెన్- హారిస్ బృందం చాలా బాగుంది: బిల్​ గేట్స్​

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​పై పరోక్ష విమర్శలు గుప్పించారు మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్​ గేట్స్​. కరోనా విజృంభణ సమయంలోనూ ఆరోగ్య నిపుణులతో ట్రంప్ విభేదించారని గుర్తు చేశారు. సీఎన్​ఎన్​ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జో బైడెన్, కమలా హారిస్​ బృందం చాలా బాగుందని కొనియాడారు గేట్స్. ఆ బృందంలో ఆరోగ్య రంగంలో అనుభవజ్ఞులైన శాస్త్రవెేత్తలు ఉన్నారని తెలిపారు. ట్రంప్​ బృందం ఆరోగ్య రంగాన్ని విస్మరించిందని పేర్కొన్నారు.

ఫైజర్, మోడెర్నా టీకాలు 90 శాతానికిపైగా విజయవంతమైనట్లు వెల్లడైన ఫలితాలను బిల్​ గేట్స్ స్వాగతించారు. ఆయన నిధులు సమకూర్చుతున్న ఆస్ట్రాజెనెకా టీకాకు బ్రిటన్​ ప్రభుత్వం త్వరలోనే ఆమోదం తెలుపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నోవావాక్స్, జాన్సన్​ అండ్​ జాన్సన్ టీకాలకు వచ్చే ఏడాది మొదట్లో అనుమతులు లభిస్తాయని అంచనా వేస్తున్నట్లు గేట్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This