పర్వత యుద్ధతంత్రంలో భారత్​ను కొట్టే సైన్యమే లేదు!

ఓ పక్క గల్వాన్ లోయలో చైనా భారీ స్థాయిలో సైన్యాన్ని దించుతున్నా.. భారత దళాలు ఏమాత్రం భయంలేకుండా నిశ్చింతగా ఉన్నాయి. యుద్ధ రంగంలో ఆయుధ సామర్థ్యాన్ని లెక్కగట్టడానికి ఓ కాన్సెప్ట్‌ను బలంగా పరిగణనలోకి తీసుకొంటారు. అదే ‘కాంబాట్‌ ప్రూవెన్’. అంటే.. యుద్ధాల్లో పాల్గొని.. శక్తిసామర్థ్యాలు నిరూపించుకోవడం. ఇప్పుడు మనం కొనుగోలు చేస్తున్న రఫెల్ అయినా.. ఇప్పటికే కొనుగోలు చేసిన అపాచీ హెలికాప్టర్లైనా ఇలాంటివే. నిరూపించుకోవడం అనే అంశం దళాలకు కూడా వర్తిస్తుంది. ఈ విషయంలో చైనా కంటే భారత దళాలకు అనుభవం ఎక్కువ. నిత్యం కశ్మీర్‌ పర్వత సానువుల్లో ఉగ్రవాదులు, పాక్‌కు చెందిన ‘బోర్డర్‌ యాక్షన్‌ టీమ్’లతో మన వాళ్లు తలపడుతుంటారు. ఈ నేపథ్యంలో పర్వత యుద్ధతంత్రలో ప్రపంచంలోనే అత్యుత్తమైన దళం భారత్‌ వద్ద ఉంది. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు.. సాక్షాత్తూ చైనా సైనిక నిపుణుడు హువాగ్‌ గ్వాజీ.

1962, 67ల్లో చైనా తీరును చూసిన భారత్‌ 1970 నుంచి పర్వత యుద్ధతంత్రంపై దృష్టిపెట్టింది. భారత్‌, పాక్‌, మయన్మార్‌ సరిహద్దుల్లో పర్వత ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడి నుంచే శత్రుదళాలు, ముష్కరులు దేశంలోకి చొరబడుతుంటారు. దీంతో భారత దళాలు పర్వతాలపై పట్టు సాధించడంపై దృష్టిపెట్టాయి. భారీ సంఖ్యలో సైనికులకు పర్వత యుద్ధతంత్రపై శిక్షణ ఇచ్చింది. మన బలగాల్లో అత్యధిక మంది సర్వీసు కూడా పర్వతాలపైనే ఉంటోంది. మౌంటేన్‌ స్ట్రైక్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేయడంపై కూడా దృష్టిపెట్టింది.

ఓ అంచనా ప్రకారం భారత్‌ వద్ద దాదాపు 12 డివిజన్లతో 2,00,000 మంది పర్వత యుద్ధతంత్ర నిపుణులు ఉన్నారు. వీరికి పారామిలటరీ సిబ్బంది అదనం. పారామిలటరీ కూడా ఇప్పటికే పలు చోట్ల పర్వత కనుమలకు పహారా బాధ్యతలు నిర్వహిస్తోంది. ప్రపంచలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్‌లో పనిచేసిన అనుభవం మన సైనికుల సొంతం. అక్కడ కనీసం ఆరువేల మంది సిబ్బంది నిత్యం పహారా కాస్తుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This