భారత్​కు నేపాల్​ మంత్రి- సరిహద్దు అంశాలే అజెండానా?

మూడు రోజుల పర్యటనలో భాగంగా భారత్​ చేరుకున్నారు నేపాల్​ విదేశాంగ మంత్రి ప్రదీప్​ కుమార్​ గ్యవాలి. శుక్రవారం జరగనున్న భారత్​-నేపాల్​ జాయింట్​ కమిషన్ 6వ​ సమావేశం(జేసీఎం)లో భారత విదేశాంగ మంత్రి ఎస్​ జైశంకర్​తో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్షతో పాటు కొవిడ్​-19 సంబంధిత సహకారంపై ప్రధానంగా చర్చించనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.

భారత్​లోని లిపులేఖ్​, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలను కలుపుతూ గతఏడాది నేపాల్​ కొత్త మ్యాప్​ను విడుదల చేసిన క్రమంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆ వివాదం చెలరేగిన తరువాత నేపాల్​ నుంచి ఓ సీనియర్​ నేత భారత పర్యటనకు రావటం ఇదే తొలిసారి.

ఈ క్రమంలో.. శుక్రవారం జరగనున్న 6వ జేసీఎం భేటీలో భారత్​-నేపాల్​ ద్వైపాక్షిక సంబంధాలతో పాటు.. వాణిజ్యం, రవాణా, విద్యుత్తు, సరిహద్దు సమస్యలు, కొవిడ్​-19 సహకారం, మౌలిక సదుపాయాలు, కమ్యూనికేషన్​, పెట్టుబడులు, వ్యవసాయం, పర్యటకం వంటి అంశాలపై చర్చించనున్నట్లు నేపాల్​ పేర్కొంది.

రెండు వేరు వేరు..

మరోవైపు.. నేపాల్​ విదేశాంగ మంత్రి పర్యటన నేపథ్యంలో చర్చలపై ఆ దేశం చేసిన ప్రకటనను తోసిపుచ్చారు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్​ శ్రీవాస్తవ. జాయింట్​ కమిషన్​ సమావేశం (జేసీఎం), సరిహద్దు చర్చలు వేరు వేరు అంశాలని స్పష్టం చేశారు.

ఉన్నతస్థాయి నేతలతో భేటీ..

మూడు రోజుల పర్యటనలో భాగంగా భారతలోని ఉన్నతస్థాయి ప్రముఖులతో భేటీ కానున్నారు నేపాల్​ విదేశాంగ మంత్రి గ్యవాలి. ఈ పర్యటనలో ఆయనతో పాటు నేపాల్​ విదేశాంగ కార్యదర్శి భరత్​ రాజ్​ పౌడ్యాల్, ఆరోగ్య శాఖ కార్యదర్శి లక్ష్మీ ఆర్యల్​లు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This