‘బీసీసీఐ అంటే సీఏకు భయం’

క్రికెట్‌ ఆస్ట్రేలియా.. బీసీసీఐకి భయపడుతోందని భారత్‌-ఆస్ట్రేలియా పర్యటనకు ప్రసారదారుగా ఉన్న ఛానల్‌-7 ఆరోపించింది. తాము ముందుగా చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ బీసీసీఐకి లబ్ది కలిగేలా సీఏ షెడ్యూల్‌లో మార్పులు చేసిందని తెలిపింది. ఈ రెండు బోర్డుల మధ్య ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయో తెలుసుకునే అవకాశాన్ని ఇవ్వాలని కోరుతూ ఆ సంస్థ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

భారత్‌తో పర్యటనను డేనైట్‌ టెస్టుతో ఆరంభించాల్సిందని, కానీ ఆ మ్యాచ్‌ను క్రికెట్‌ ఆస్ట్రేలియా డిసెంబర్‌ 17కు మార్చిందని.. వన్డే, టీ20లను ముందుగా నిర్వహిస్తోందని సెవన్‌ వెస్ట్‌ మీడియా సీఈవో వార్‌బర్టన్‌ అన్నాడు. ప్రసారదారుతో ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు కోర్టులో తేలితే.. క్రికెట్‌ ఆస్ట్రేలియా వేల కోట్లలో జరిమానా చెల్లించాల్సి రావచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This