ఈ మైలురాయికి 20ఏళ్లు పట్టింది: బన్నీ

అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అల వైకుంఠపురములో’ ఘన విజయం సాధించింది. ఆ సినిమా వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్రబృందం.. సంబరాలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నటీనటులతో పాటు దర్శకనిర్మాతలు, టెక్నీషియన్లు.. ఇలా చిత్రబృందం మొత్తం పాల్గొని సందడి చేసింది.

ప్రతి క్షణం ఎంజాయ్ చేశా..

అల్లు అర్జున్‌ మాట్లాడుతూ.. “ఈ రోజు ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే.. 2020 ఎంతో మందికి చేదుజ్ఞాపకం కానీ.. నాకు మాత్రం తీపి జ్ఞాపకాన్నిచ్చిన ఏడాది. ఈ సినిమా వల్ల లాక్‌డౌన్‌లోనూ ప్రతి క్షణాన్ని ఎంజాయ్‌ చేశాను. నాకు మంచి మైలురాయి రావడానికి 20 సినిమాలు పట్టింది. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ ధన్యావాదాలు. ఈ సినిమా ఎంత పెద్దవిజయం సాధించినా అందరికంటే మంచి పేరు వచ్చింది నాకే. తమన్‌ ఒక్క పాట కాదు.. అల్బమ్‌ మొత్తం అద్భుతంగా ఇచ్చారు. ఇప్పటికీ ఈ సినిమా పాటలు వింటున్నా. త్రివిక్రమ్‌ కేవలం నాకు డైరెక్టర్‌ మాత్రమే కాదు.. పెద్దన్నలాంటి వారు. సినిమాను ఆదరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు” అని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This