కరోనా సోకిందని తలుపులకు స్టీల్​ రేకులతో సీల్​!

కర్ణాటక, బృహత్​ బెంగళూరు మహానగర పాలక సంస్థ కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు వినూత్న చర్యలకు దిగి అబాసుపాలైంది. ఓ కరోనా కేసు నమోదైందని రెండు ఇళ్లకు స్టీల్ రేకులతో సీల్​ వేసింది.

బెంగళూరులోని దొమ్మలూర్ ప్రాంతంలో ఓ భవనంలో కరోనా కేసు నమోదైంది. దీంతో అధికారులు ఆ భవనంలోని రెండు కుటుంబాలను హోమ్​ క్వారంటైన్​లో ఉండమని హెచ్చరించారు. అంతటితో ఆగక, వారు బయటికి రాకుండా ఉండేలా తలుపులను ఉక్కు రేకులతో మూసేశారు.​ ఓ మహిళతో పాటు ఇద్దరు పిల్లలు, వృద్ధ దంపతులు ఉన్న ఇంటిని ఇలా బంధించడమేంటంటూ ట్వీట్​ చేసింది ఆ మహిళ. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు వెంటనే ఉక్కు సీల్​ను తీసేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This