కేర‌ళ‌లో స్టెప్పులేస్తున్న ‘రూలర్’ బాల‌య్య‌..

నంద‌మూరి బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న చిత్రం ‘రూల‌ర్‌’. కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. సి. కల్యాణ్ నిర్మాత. తాజాగా చిత్రబృందం షూటింగ్​ కోసం కేరళ వెళ్లింది. అక్కడ బాల‌కృష్ణ – వేదిక‌ల‌పై ఓ పాటని తెర‌కెక్కిస్తున్నారు. రామ‌జోగ‌య్య‌ శాస్త్రి రాసిన ఈ పాట‌కు, ప్రేమ్‌ర‌క్షిత్ నృత్య‌రీతులు స‌మ‌కూరుస్తున్నాడు.

త్వ‌ర‌లో టీజ‌ర్‌ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో బాల‌కృష్ణ పాత్ర రెండు కోణాల్లో ఉండ‌బోతోంది. పోలీస్ అధికారిగా, ఐటీ ఆఫీస‌ర్‌గా ఆయ‌న న‌టించ‌బోతున్నారు. షూటింగ్ పూర్తి చేసి డిసెంబ‌రులో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతోంది చిత్రబృందం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This