భాజపా నేతను కాల్చి చంపిన దుండగులు

బంగాల్​లో దారుణ ఘటన జరిగింది. ఉత్తర 24 పరగణాల జిల్లా టిటాగఢ్​లో ఓ స్థానిక భాజపా నేతను కాల్చి చంపారు దుండగులు. ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు కాల్పులకు తెగబడినట్లు పోలీసులు తెలిపారు.

బీటీ రోడ్డు ప్రాంతంలో స్థానిక కౌన్సిలర్​ మనీశ్​​ శుక్లాపై రాత్రి 9.30 గంటల ప్రాంతంలో కాల్పులు జరిపారు దుండగులు. స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. టిటాగఢ్​ పోలీస్​ స్టేషన్​కు సమీపంలోనే హత్య జరగటం గమనార్హం.

సమాచారం మేరకు ఘటనా స్థలికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకొని తనిఖీలు చేపట్టారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి బాధ్యతులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీనియర్​ అధికారి ఒకరు తెలిపారు.

సీబీఐ దర్యాప్తునకు డిమాండ్​.

కాల్పులకు పాల్పడింది అధికార తృణమూల్​ కాంగ్రెస్ అని ఆరోపించింది భాజపా నాయకత్వం. సీబీఐ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్​ చేసింది. శుక్లా హత్యకు అధికార టీఎంసీనే బాధ్యత వహించాలని భాజపా ఎంపీ అర్జున్​ సింగ్ డిమాండ్​ చేశారు.​

” ప్రత్యర్థులు లేకుండా చేసే రాజకీయాలను టీఎంసీ ప్రారంభించటం సిగ్గుచేటు. పోలీస్​ స్టేషన్​ ఎదుటే ఈ ఘటన జరిగిన క్రమంలో స్థానిక పోలీసులపై మాకు నమ్మకం లేదు. సీబీఐ దర్యాప్తు చేయాలి.”

– కైలాస్​ విజయ్​వర్గియా, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This