రష్యాలో బుల్లితెరపై ‘బాహుబలి’ హంగామా

భారతీయ సినీ పరిశ్రమ సత్తా చాటిన తెలుగు చిత్రం ‘బాహుబలి’. దీనిని తాజాగా రష్యాలోని ఓ టెలివిజన్‌ ఛానెల్లో రష్యన్‌ వాయిస్‌ ఓవర్‌తో ప్రసారం చేశారు. అదే విషయాన్ని రష్యన్‌ ఫెడరేషన్‌ రాయబార ఇండియా కార్యాలయం తన అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేసింది. “భారతీయ సినిమా రష్యాలో ప్రజాదరణ పొందింది. ప్రస్తుతం రష్యన్‌ టీవీ ప్రసారం చేస్తున్న వీడియోను చూడండి అంటూ” రాసుకొచ్చింది.

దర్శకధీరుడు రాజమౌళి అద్భుతసృష్టి ‘బాహుబలి’.. మనదేశ చిత్రసీమ గొప్పతనాన్ని చాటిచెబుతూనే ఉందనడానికి ఇదొక నిదర్శనం. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​గా మారింది.

ఈ సినిమాలో ప్రభాస్‌, అనుష్క శెట్టి, రానా, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్‌, నాజర్‌ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. దర్శకుడు రాఘవేంద్రరావు సమర్పణలో ఆర్కా మీడియా పతాకంపై నిర్మితమైన ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు. హిందీతో పాటు దక్షిణాది అన్నీ భాషలో సినిమా విడుదలై ప్రభంజనం సృష్టించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This