బస్సులో పుట్టిన శిశువుకు ఆర్టీసీ డిపో పేరు

ఉత్తర్​ప్రదేశ్​ మహోబా పట్టణంలో ఆసక్తికర ఘటన జరిగింది. తమ ఇంటిలో కొత్తగా పుట్టిన శిశువుకు బస్ డిపో పేరు పెట్టారు ఆమె తల్లిదండ్రులు.

పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని మహోబాలోని ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలోనే ఆర్​టీసీ బస్సులో శిశువుకు జన్మనిచ్చింది ఆ మహిళ. ఆమెకు తోటి మహిళా ప్రయాణికులు సాయం చేశారు.

అనంతరం బస్సు డ్రైవర్​, కండక్టర్​.. తల్లీబిడ్డలను ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్​, కండక్టర్​ చేసిన సాయానికి కృతజ్ఞతగా తన కూతురుకు ‘మహోబా డిపో’ అని పేరు పెట్టినట్లు ఆ మహిళ తెలిపింది.

తల్లి, శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపిన వైద్యులు.. వారిని డిశ్చార్జి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This