18 -11-19 అయిదవరోజు అతిరుద్ర యాగం వివరాలు

ముఖ్యంగా అనేక ప్రాంతాల నుంచి తరలి వస్తున్న వేలాది మంది భక్తులకు ఉచిత భోజన వసతిని అలాగే ఉచిత విడిది వసతి సౌకర్యం ఆశ్రమం కార్యవర్గం చక్కటి ఏర్పాటులను మరియ మెడికల్ సౌకర్యాలని కూడా అందజేస్తున్నారు .

కాశి లో మైసూరు శ్రీ అవధూత దత్త పీఠాధిపతి  శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు చేస్తున్న  అతిరుద్ర యాగం ఈ నెల 13-11-19 నుండి 24-11-19 వరకు గంగా నదీ తీరాన శివాలీ ఘట్ నందు అత్యంత వైభవంగా ప్రారంభమైంది.

కార్తీకమాసంలో అత్యంత పవిత్రమైన ముఖ్యమైన సోమవారం నాడు 121 మంది వేద పండితులతో చతుర్వేద పారాయణం తో అతిరుద్ర యాగంని ఈ రోజు  శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ప్రారంభించారు  ఈరోజు ముఖ్యంగా కోటి సార్లు దత్తాత్రేయ మూల మంత్రంతో వేద పండితులతో మూల మంత్రంని పట్టిస్తూ శ్రీ దత్త హోమం చేశారు

అనంతరం ఉదయం  10 గం ।। లకు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు , శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారు
మరియు వేద రుత్విక్ లతో  భారతదేశం లోని పుణ్య నది జలాలతో కాశీ విశ్వేశ్వరునికి రుద్ర నమక చమకాలు తో రుద్రాభిషేకం చేశారు 5 వ రోజు అతిరుద్ర యాగం నికి పూర్ణాహుతి సమర్పించారు.

శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు భక్తులనుద్దేశించి మాట్లడుతూ కాశీకి వెళతాను అంటేనే ఎంతో పుణ్యం అలాంటిది కాశీకి రావడం అంటే మరో జన్మ ఉండదని అంటారు . అలాంటిది శివునికి ఎంతో ప్రీతిపాత్రమైన అతిరుద్ర యాగం లో పాల్గొనడం అంటే ఎన్నో జన్మల పుణ్య ఫలం మీ అందరి లభిస్తుందని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు  అన్నారు.
అలాంటిది ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఎన్ని వేల మంది భక్తులకు అలాగే ఈ కార్యక్రమాన్ని పరోక్షంగా టీవీల ద్వారా చూస్తున్న వారికి ఈ కార్యక్రమం గురించి విన్నవారి కి కూడా కోటి జన్మల పుణ్య ఫలం వస్తుందని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ  ప్రసంగించారు

శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ఈరోజు గౌరీ కళ్యాణం అత్యంత ఘనంగా చేశారు కల్యాణం అనంతరం అక్కడికి తరలివచ్చిన వేలాది మంది భక్తులకు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు తీర్థప్రసాదాలు ఇచ్చారు

ముఖ్యంగా అనేక ప్రాంతాల నుంచి తరలి వస్తున్న వేలాది మంది భక్తులకు ఉచిత భోజన వసతిని అలాగే ఉచిత విడిది వసతి సౌకర్యం ఆశ్రమం కార్యవర్గం చక్కటి ఏర్పాటులను మరియ మెడికల్ సౌకర్యాలని కూడా అందజేస్తున్నారు .

ఈనెల నవంబర్ 24వ తేదీ వరకు జరిగే ఈ అతిరుద్ర యాగం నందు అనేక మంది భక్తులు పాల్గొంటున్న నేపథ్యంలో ప్రతి ఒక్క భక్తులకి  ఉచిత వసతి భోజనాలను సౌకర్యాలను కల్పిస్తూ ఆశ్రమ కమిటీ వారు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు అదేవిధంగా కాశీ పట్టణ పోలీస్ శాఖ వారు మరియు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది వారు ప్రభుత్వం యత్రాగం వారు ప్రతి నిమిషము అవసరమైన ఏర్పాట్లు చేస్తూ ఎటువంటి అసౌకర్యాలకి భక్తులు  గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This