నవంబర్ 11, 2019 రాశి ఫలాలు

మేషం
దూరప్రాంతాల నుంచి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. భూములు, భవనాలు కొనుగోలు చేస్తారు. వాహనసౌఖ్యం ఉంది.

వృషభం

కష్టపడ్డా ఫలితం అంతగా ఉండదు. ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా పూర్తిచేస్తారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది.

మిథునం
సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. కార్యజయం ఉంది. భూ వివాదాలు తీరి లబ్ది పొందుతారు. చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలను పంచుకుంటారు.

కర్కాటకం
ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తిచేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. బంధువులతో ఆనందంగా గడుపుతారు. వాహనయోగం పొందుతారు.

సింహ

ఇంటాబయటా ఒత్తిడులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. పనులలో జాప్యం జరిగినా నిదానంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

కన్య
దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

తుల
చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. సోదరులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. కాంట్రాక్టులు దక్కుతాయి.

వృశ్చికం
మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగులు చేస్తారు. వాహనయోగం పొందుతారు.

ధనుస్సు
ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఋణ బాధలు తప్పవు. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. జీవితభాగస్వామి నుంచి సాయం అందుకుంటారు.

మకరం
కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఋణాలు తీరి ఊరట చెందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

కుంభం
మిత్రులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు.

మీనం
ఇంటాబయటా అనుకూలంగా ఉంటుంది. పనులు నిదానంగా పూర్తిచేస్తారు. శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సోదరుల నుంచి ధనలాభాలు పొందుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This