నవంబర్ 9, 2019 రాశి ఫలాలు

మేషం
వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సహాయసహకారాలు అందుకుంటారు. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

వృషభం

ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుకుంటారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి.

మిథునం
దీర్ఘకాలిక ఋణాలు కొంతమేర తీరి ఊరట చెందుతారు. పనులు నిదానంగా పూర్తిచేస్తారు. మిత్రుల నుంచి వ్యాపారపరంగా కీలక సమాచారం అందుకుంటారు. ధనలాభాలు పొందుతారు.

కర్కాటకం
కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. పనులలో మిత్రుల నుంచి సహాయసహకారాలు అందుకుంటారు. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది.

సింహ
ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. ఋణాలు కొంత వరకు తీరుతాయి. రాజకీయ, కళా, పారిశ్రామిక రంగాల వారు సన్మానాలు, సత్కారాలు పొందుతారు. వాహనసౌఖ్యం పొందుతారు.

కన్య
నూతన భాగస్వాములతో కలిసి వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. సంతానం నుంచి ధనలాభాలు పొందుతారు. సోదరసోదరీమణులతో కష్టసుఖాలను పంచుకుని ఆనందంగా గడుపుతారు.

తుల
సంతానం నూతన విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. వస్తులాభాలు పొందుతారు.

వృశ్చికం
దూరపు బంధువుల నుంచి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం.

ధనుస్సు
సోదరుల నుంచి ధనలాభాలు పొందుతారు. విందువినోదాలు, శుభకార్యాలలో పాల్గొంటారు. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తిచేస్తారు.

మకరం
ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. ఋణ బాధలు ఎదురై చికాకులు పెట్టినా అధిగమించి ముందుకు సాగుతారు. జీవితభాగస్వామి నుంచి ధనలాభాలు పొందుతారు.

కుంభం
బంధువులతో ఏర్పడిన ఆస్తి వివాదాలుపరిష్కారమై ఊరట చెందుతారు. చేపట్టిన పనులను కుటుంబసభ్యుల సహాయసహకారాలతో సకాలంలో పూర్తిచేస్తారు. వాహనసౌఖ్యం పొందుతారు.

మీనం
ముఖ్యమైన వ్యవహారాలూ విజయవంతంగా సకాలంలో పూర్తిచేస్తారు. అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఋణ బాధలు కొంతవరకు తీరుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This