లద్దాఖ్​​లో మోదీ పర్యటన.. సైనిక సన్నద్ధతపై సమీక్ష

భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ లద్దాఖ్​లో ఆకస్మిక పర్యటన చేపట్టారు. ఆయన వెంట త్రిదళాధిపతి బిపిన్‌ రావత్‌, సైనికాధిపతి నరవణే ఉన్నారు. సైనిక దళాలతో భేటీ అయిన మోదీ వారిలో ధైర్యాన్ని నింపారు.

చైనాతో సరిహద్దు వివాదం, మిలిటరీ చర్చల్లో పురోగతి నేపథ్యంలో… ప్రధాని మోదీ లద్దాఖ్ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. లద్దాఖ్​లోని నిము ప్రాంతంలో ఆర్మీ, వైమానిక, ఐటీబీపీ ఉన్నతాధికారులతో భేటీ అయిన మోదీ… సరిహద్దు భద్రతా పరిస్థితులను సమీక్షించారు.

జవాన్లకు పరామర్శ

ఇటీవల గల్వాన్ ఘర్షణలో గాయపడి మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జవాన్లను ప్రధాని మోదీ పరామర్శించనున్నారు. వీర సైనికులకు భరోసా ఇవ్వడం, చైనాకు గట్టి సందేశం ఇవ్వడమే లక్ష్యంగా మోదీ లద్దాఖ్ పర్యటన చేస్తున్నట్లు కనిపిస్తోంది.

ప్రధాని లద్దాఖ్ పర్యటన ద్వారా సైన్యానికి… దేశం మొత్తం మద్దతుగా ఉందనే సంకేతాన్ని ఇచ్చారని రక్షణ నిపుణులు అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This