జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ఉగ్రవాది హతం

అవంతిపొరాలో ముష్కరుడి హతం

జమ్ముకశ్మీర్​ అవంతిపొరా జిల్లాలో జరిగిన ఎన్​కౌంటర్​లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. జిల్లాలోని పాంపోర్​లో భద్రతా బలగాలు నిన్న రాత్రి తనిఖీలు చేపడతుండగా మసీదును ఆనుకుని ఉన్న భవనంలో ఉగ్రవాదులు తారసపడ్డారు.

ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించగా బలగాలు ప్రతిఘటించాయి. ఆ భవనంపై ఒక గ్రెనేడ్​తో దాడి చేయగా.. ఉగ్రవాదులు తొలుత మసీదులోకి వెళ్లినట్లు గుర్తించారు. అనంతరం ముష్కరులు పక్కన ఉన్న ఒక షెడ్​లోకి వెళ్లగా బలగాలు తిరిగి కాల్పులను ప్రారంభించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This