‘నేపాల్ ఆర్మీ జనరల్​’గా నరవాణే!

భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే నేటి నుంచి మూడు రోజుల పాటు నేపాల్‌లో పర్యటించనున్నారు. రక్షణ, భద్రతా అంశాలపై అక్కడి ఆర్మీ ఉన్నతాధికారులతో కీలక చర్చలు జరపనున్నారు. నేపాల్​ ప్రధాని కేపీ శర్మ, రక్షణ మంత్రి ఈశ్వర్​ పోఖ్రెల్​, ఆర్మీ చీఫ్​ పూర్ణ చంద్ర థాపాలతో నరవాణే భేటీ కానున్నారు.

ఈ పర్యటనలో నేపాల్​ ప్రధానిని కలుస్తున్నాను. ఇరుదేశాల మధ్య రక్షణ, భద్రత, ద్వైపాక్షిక అంశాలకు సంబంధించి చర్చలు జరగనున్నాయి. ఆ దేశ అధ్యక్షురాలు నుంచి గౌరవ ‘జనరల్ ఆఫ్ ది నేపాల్ ఆర్మీ’ ర్యాంకు తీసుకొబోతుండడం ఆనందంగా ఉంది.

– జనరల్​ ఎం.ఎం నరవాణే, భారత ఆర్మీ చీఫ్

పర్యటన సాగనుందిలా….

నేటి నుంచి ప్రారంభంకానున్న ఈ పర్యటనలో భారత-నేపాల్​ మధ్య సత్సంబంధాల పునరుద్ధరణకు చర్చలు జరగనున్నాయి. 1950లో ప్రారంభమైన పురాతన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. జనరల్​ నరవాణేకు నేపాల్​ అధ్యక్షురాలు బిద్యా దేవి భండారి ‘జనరల్ ఆఫ్ ది నేపాల్ ఆర్మీ’ గౌరవ ర్యాంకును ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమం కాఠ్మాండులో జరగనుంది. భారత్ కూడా ‘జనరల్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ’ గౌరవ ర్యాంకును నేపాల్ ఆర్మీ చీఫ్‌కు ప్రదానం చేస్తుంది.

నేపాల్​ కొత్త మ్యాప్​​ తర్వాత తొలిసారి పర్యటన…

ఇటీవల నేపాల్​ ప్రకటించిన కొత్త మ్యాప్​ విషయంలో ఇరుదేశాలకు మధ్య వివాదాలు నెలకొన్నాయి. ఇరువురికీ దాదాపు 1800 కి.మీ మేర సరహద్దు ఉంది. భారత్​లోని లిపులేఖ్, కాలపానీ సహా లింపియాధురా ప్రాంతాలను తమవిగా పేర్కొంటూ నేపాల్​ కొత్త మ్యాప్​ను విడుదల చేశాక.. ఇరుదేశాల మధ్య జరుగుతున్న తొలి అత్యున్నత స్థాయి సమావేశం ఇదే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This