ఎస్‌ఈసీ ‘ఆర్డినెన్స్‌’పై నేడు హైకోర్టు తీర్పు

ఏపీ ఎన్నికల కమిషనర్‌(ఎస్‌ఈసీ) నియామకం, పదవీకాలం విషయమై పంచాయతీరాజ్‌ చట్టానికి సవరణ చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌, తదనంతర జీవోలపై దాఖలైన వ్యాజ్యాల్లో శుక్రవారం హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. తనను తొలగించాలన్న దురుద్దేశంతో ఆర్డినెన్స్‌ తీసుకొచ్చారని దానిని రద్దు చేయాలని కోరుతూ మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఏపీ‌ హైకోర్టును ఆశ్రయించారు. ఆర్డినెన్స్‌ను సవాలు చేస్తూ హైకోర్టులో మొత్తం 13 వ్యాజ్యాలు దాఖలయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This