కూరగాయల మార్కెట్‌లో అనుక్ష్క శర్మ ఫొటో తీసిన విరాట్

రోజంతా బిజీగా ఉండే సెలబ్రిటీలకు ఒత్తిడి తగ్గించి ఉత్సాహాన్నిచ్చేది వెకేషన్సే. ఇండియాలో ఎక్కడా వారు విహారయాత్రలను ఎంజాయ్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఎక్కడికి వెళ్లినా జనాలు గుర్తుపట్టి చుట్టుముట్టేస్తుంటారు. అందుకే విదేశాలకు వెళ్లి హాయిగా రిలాక్స్ అయ్యి వస్తుంటారు. సినీ సెలబ్రిటీల విషయం అటుంచితే.. క్రికెటర్లు విదేశాల్లో కూడా సరదాగా ఎంజాయ్ చేయలేని పరిస్థితులు వస్తుంటాయి. ఎందుకంటే వారికి ఇంటర్నేషన్ రేంజ్‌లో పాపులారిటీ ఉంటుంది. ఇక్కడ టాపిక్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి. కొన్ని రోజులుగా క్రికెట్‌తో బిజీగా ఉన్న విరాట్.. తన భార్య, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మతో కలిసి వెకేషన్‌ నిమిత్తం భూటాన్ వెళ్లారు. ఇది ప్రపంచంలోనే హ్యాపీయెస్ట్ కంట్రీ అట.

ఈ నేపథ్యంలో అనుష్క అక్కడి కూరగాయల మార్కెట్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా విరాట్ తన భార్య ఫొటోను క్లిక్‌మనిపించాడు. భూటాన్ తనకు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసిందని అనుష్క తెలిపారు. ‘కూరగాయల మార్కెట్‌కు వెళ్లగానే చాలా సంతోషంగా అనిపించింది. ఎన్నో చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి’ అని పేర్కొన్నారు. భూటాన్‌లోని అందమైన ప్రదేశాలను ఫొటో తీసి అనుష్క సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రేపు విరాట్ బర్త్‌డే. అందుకే ముందుగా ఇద్దరూ భూటాన్ చేరుకున్నారు. విరాట్ బర్త్‌‌డే సెలబ్రేషన్స్‌ను అనుష్క అక్కడ గ్రాండ్‌గా నిర్వహించనున్నారట. అంతేకాదు విరాట్, అనుష్క త్వరలో రెండో పెళ్లి రోజును కూడా జరుపుకోబోతున్నారు. 2017 డిసెంబర్ 11న వీరిద్దరూ ఇటలీలో గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇక అనుష్క సినిమాల విషయానికొస్తే ఆమె చివరగా నటించిన ‘జీరో’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. దాంతో దాదాపు ఏడాది పాటు ఆమె మరో ప్రాజెక్ట్‌కు సంతకం చేయలేదు. తన భర్తతో కలిసి మ్యాచ్‌లను ఎంజాయ్ చేస్తూ గడిపేశారు. త్వరలో అనుష్క ‘సత్తే పే సత్తా’ అనే సూపర్ హిట్ సినిమా రీమేక్‌లో నటించనున్నట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే దీనిపై ఇంకా అఫీషియన్ అనౌన్స్‌‌మెంట్ రాలేదు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This