మరో మహిళతో రెడ్​ హ్యాండెడ్​గా భార్యకు దొరికిన ఎస్సై…

మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఎస్సైపై బంధువులతో కలిసి అతని భార్య దాడి చేసిన ఘటన… గురువారం అర్ధరాత్రి నాచారం పరిధిలోని మల్లాపూర్​లో జరిగింది. మహేశ్వరం ఎస్సైగా పనిచేసిన నర్సింహ కొంతకాలం క్రితం సస్పెండయ్యాడు. అప్పటి నుంచి మల్లాపూర్​లో ఉంటూ మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు.

ఇది గమనించిన నర్సింహ భార్య.. అర్థరాత్రి బంధువులతో కలిసి అక్కడికి వెళ్లింది. వీరి రాకను గుర్తించిన నర్సింహ అక్కడి నుంచి పరారయ్యాడు. మహిళపై దాడి చేసేందుకు బంధువులు ప్రయత్నించగా అప్పటికే అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This