ఎలా బతకాలో ఆమె నుంచే నేర్చుకున్నా: అనసూయ

తన మాటల సందడితో బుల్లితెర ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడమే కాదు.. ‘రంగమ్మత్త’ లాంటి పాత్రలతో వెండితెరపైనా శెభాష్‌ అనిపించుకున్నారామె. ఏ షోలోనైనా ఆమె ఉంటే ఆ సందడే వేరు. చలాకీ మాటలతో, చిరునవ్వులతో అలా కాలం గడిచిపోతుంది. ఆమెనే వ్యాఖ్యాత, నటి అనసూయ. ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో పాల్గొని అనేక సరదా ముచ్చట్లతో పాటు, తన జీవితంలో పడిన కష్టాలను వెల్లడించింది.

మీ అసలు పేరు పవిత్రా?

అనసూయ: అమ్మ నా పేరు పవిత్ర అని పెడదామనుకున్నారట. నాన్నగారి కుటుంబం నుంచి చూస్తే నేనే మొదటి ఆడపిల్లను. దీంతో వాళ్లమ్మ పుట్టిందనుకొని ఆ పేరు పెట్టారు. అలా నా పేరు అనసూయ అయింది.

అనసూయ పేరు కలిసొచ్చిందా? పవిత్ర పెడతే బాగుంటుందని ఎప్పుడైనా అనుకున్నారా?

అనసూయ: చాలాసార్లు అనుకున్నా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి స్కూల్లో చాలా మంది కావాలని గట్టిగా ‘అనసూయ…’ అంటూ పిలిచేవారు. అప్పటి నుంచి ఎవరైనా ‘అను’ అని పిలిస్తేనే పలికేదాన్ని. ఎన్‌సీసీలో చేరిన తర్వాత ‘అనసూయ’ పేరు వెనుక ఉన్న కథ తెలిసి సిగ్గుపడ్డా. ఆ తర్వాత ఎవరు ఎలా పిలిచినా పట్టించుకునేదానిని కాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This