అమిత్ షా ఖాతాను కాసేపు నిలిపేసిన ట్విట్టర్

కేంద్ర హోంమంత్రి అమిత్​ షా ట్విట్టర్ ఖాతాను ఆ సంస్థ గురువారం రాత్రి​ నిలిపేసింది. కొంతసమయం తర్వాత మళ్లీ పునరుద్ధరించినట్లు ప్రకటించింది. గ్లోబల్ కాపీరైట్ విధానాల కింద ఈ చర్య తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. అసలేం జరిగిందంటే..

గురువారం రాత్రి అమిత్ షా ఖాతా నుంచి ప్రొఫైల్ చిత్రం మాయమైంది. దాని స్థానంలో “ఈ చిత్రం కనబడటం లేదు” అని ఉంది. అమిత్ షా ట్విట్టర్​ ఖాతాలోని ఆయన ప్రొఫైల్ చిత్రంపై తనకు కాపీరైట్​ ఉన్నట్లు ఓ వ్యక్తి ఫిర్యాదు చేసిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. అనంతరం అమిత్ షా ప్రొఫైల్ చిత్రాన్ని తొలగించటంతోపాటు ఖాతాను నిలిపేసింది.

గ్లోబల్ కాపీరైట్ విధానాల కింద పొరపాటున అమిత్ షా ఖాతాను నిలిపేసినట్లు ట్విట్టర్​ తెలిపింది. వెంటనే సరిదిద్దుకున్నామని ఆ సంస్థ అధికార ప్రతినిధి ప్రకటించారు.

ట్విట్టర్​ చర్యపై నెటిజన్లు విమర్శలు చేశారు. కాపీరైట్​ ఎవరు క్లెయిమ్ చేశారో చెప్పడంటూ ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This