బూడిద రంగు హెయిర్​స్టైల్​తో ఆమిర్​

పాత్రకు తగ్గట్లుగా తన శరీరాన్ని మార్చుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు బాలీవుడ్​ అగ్ర కథానాయకుడు ఆమిర్​ ఖాన్​. అందుకే ఆయన్ని అభిమానులంతా మిస్టర్​ పర్ఫెక్షనిస్ట్​గా కీర్తిస్తుంటారు. కేవలం సినిమా సినిమాకు తన శరీరాన్ని మార్చుకోవడమే కాదు.. దానికి తగ్గట్లుగా సరికొత్త హెయిర్​ స్టైల్స్​తోనూ తెరపై కనువిందు చేస్తుంటారు​. తాజాగా మరో కొత్త హెయిర్​ స్టైల్​తో ముందుకొచ్చి అందరీ దృష్టిని ఆకర్షిస్తున్నారు.

ఆమిర్​ తనయ ఇరా ఖాన్​ తన తండ్రితో దిగిన ఓ ఫొటోను ఇన్​స్టాలో పోస్ట్​ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్​గా మారింది. ఇందులో ఆమిర్​ నీలం రంగు టీషర్ట్​, పెద్ద తెలుపు రంగు కళ్లజోడు ధరించి బూడిద రంగు వెంట్రుకలతో ఫంకీ స్టైల్​లో కనిపించారు.

ఆమిర్​ గతంలో ‘గజినీ’, ‘దంగల్’​ ‘పీకే’ సినిమాల్లో విభిన్నమైన హెయిర్​స్టైల్స్​తో కనపించి అభిమానులను అలరించారు. ప్రస్తుతం ‘లాల్​ సింగ్​ చద్దా’ అనే చిత్రంలో నటిస్తున్నారు​.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This