టిక్​టాక్​పై అమెజాన్ నిషేధం.. ఆపై సవరణ

ప్రముఖ వీడియో యాప్​ టిక్‌టాక్‌​ను వాడకూడదని తమ ఉద్యోగులకు ఇచ్చిన ఆదేశాలపై వివరణ ఇచ్చింది ఈ- కామర్స్ దిగ్గజం అమెజాన్​. యాప్​ను డిలీట్ చేయాలని తమ ఉద్యోగులకు పొరపాటున మెయిల్​ చేసినట్లు స్పష్టం చేసింది.

“ఈ రోజు ఉదయం మా ఉద్యోగులకు పొరపాటున మెయిల్​ వెళ్లింది. టిక్​టాక్​ యాప్​నకు సంబంధించి మా విధానాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.”

– జేసీ అండర్సన్​, అమెజాన్​ అధికార ప్రతినిధి

అయితే ఈ మెయిల్ వెనక ఏం జరిగిందన్న విషయంపై స్పందించేందుకు జేసీ అండర్సన్​ నిరాకరించారు.

ఇదీ జరిగింది..

టిక్​టాక్​ యాప్​ వాడొద్దంటూ తమకు ఈమెయిల్​ ద్వారా అమెజాన్​ ఆదేశాలు ఇచ్చినట్లు సంస్థకు చెందిన కొంతమంది ఉద్యోగులు ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ మెయిల్లో.. అమెజాన్​ ఈమెయిల్ వాడే ప్రతి ఒక్కరూ కచ్చితంగా టిక్​టాక్​ను తొలగించాలని సంస్థ మార్గదర్శకాలు జారీ చేసినట్లు ఉద్యోగులు వివరించారు. టిక్​టాక్​ ద్వారా భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని.. యాప్​ను తొలగించిన తర్వాతే ఈ- మెయిల్​ వినియోగించుకునేందుకు అవకాశం​ ఉంటుందని అమెజాన్​ స్పష్టం చేసినట్లు సమాచారం.

అమెరికా దిగ్గజ రిటైల్‌ కంపెనీల్లో వాల్‌మార్ట్‌ తరువాత 8.4 లక్షల మంది ఉద్యోగులతో అమెజాన్‌ రెండో అతిపెద్ద కంపెనీగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This