హెవీ వెయిట్​ షేర్లలో అమ్మకాలు- ఒడుదొడుకుల్లో సూచీలు

ఆరంభంలో లాభాలు.. అంతలోనే నష్టాలు

స్టాక్​ మార్కెట్లు సోమవారం ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ దాదాపు 70 పాయింట్ల నష్టంతో 37,809 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 10 పాయింట్లకుపైగా కోల్పోయి 11,165 వద్ద ఫ్లాట్​గా ట్రేడవుతోంది.

ఆరంభంలో విద్యుత్​, లోహ, చమురు రంగాల దన్నుతో లాభాలు నమోదు చేసిన సూచీలు కొద్ది సేపటికే ఒడుదొడుకుల్లోకి జారుకున్నాయి.

రిలయన్స్ సహా ఇతర హెవీ వెయిట్​ షేర్లు, ఆర్థిక రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఒడుదొడుకులకు కారణంగా తెలుస్తోంది.

ఎన్​టీపీసీ, టాటా స్టీల్​, ఓఎన్​జీసీ, ఎల్​&టీ, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్​ లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.

రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్​టెల్​, యాక్సిస్​ బ్యాంక్, ఎస్​బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్​ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This