‘ఇలా అయితే టీకా అందేసరికి ఏళ్లు గడిచిపోతాయ్​’

దేశంలో కరోనా వ్యాక్సిన్ల సరఫరా విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ యంత్రాంగంపై విమర్శల వర్షం కురిపించారు అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్​. పంపిణీ ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతున్నట్టు అభిప్రాయపడ్డారు.

“ఇదే తీరులో వెళితే.. అమెరికన్లకు టీకా అందేసరికి నెలలు కాదు.. సంవత్సరాలు పడుతుంది.”

— జో బైడెన్​, అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత.

తాను అధ్యక్ష పదవిని చేపట్టిన అనంతరం.. రోజుకు మిలియన్​ టీకాలు అందే విధంగా చర్యలు చేపడతానని హామీనిచ్చారు బైడెన్​. అయినప్పటికీ.. అమెరికన్​ జనాభాలో మెజారిటీ మందికి వ్యాక్సిన్​ అందేసరికి నెలలు గడిచిపోతాయన్నారు.

అమెరికాను సరైన మార్గంలో నడిపించేందుకు తాను ఏది చేయడానికైనా సిద్ధమని పునరుద్ఘాటించారు డెమొక్రటిక్​ నేత.

అగ్రరాజ్యంలోకి కొత్త కరోనా..

అమెరికాలోని కొలొరాడోలో కొత్త రకం కరోనాను గుర్తించారు. బ్రిటన్​లో వెలుగు చూసిన ఈ కరోనా స్ట్రెయిన్​.. అమెరికాలో కనపడటం ఇదే తొలిసారి. 20ఏళ్ల వ్యక్తికి ఈ రకం వైరస్​ సోకినట్టు.. అతను ప్రస్తుతం అసొలేషన్​లో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. అయితే ఇటీవలి కాలంలో అతడు ఎక్కడికి ప్రయాణించకపోవడం ఆందోళన కలిగించే విషయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This