బైడెన్​ ప్రమాణస్వీకారానికి భారతీయ-అమెరికన్​ ఏర్పాట్లు

వచ్చే ఏడాది జనవరి 20న జరగనున్న తన ప్రమాణస్వీకార మహోత్సవాన్ని పర్యవేక్షించేందుకు నలుగురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్​. ఈ పీఐసీ (ప్రెసిడెన్షియల్​ ఇనాగరల్​ కమిటీ)లో భారతీయ-అమెరికన్​ మజు వర్గీస్​కు ఎగ్జిక్యూటివ్​ డైరక్టర్​ పదవిని అందించారు.

ఇదే బృందంలో టోనీ ఆలెన్​(చీఫ్​ ఎగ్జిక్యూటివ్​ ఆఫీసర్​), ఎరిన్​ విల్సన్​(డిప్యూటీ ఎగ్జిక్యూటివ్​ డైరక్టర్​), వాన్న కాన్సెల(డిబ్యూటీ ఎగ్జిక్యూటివ్​ డైరక్టర్​)లు ఉన్నారు.

తనకు ఈ బాధ్యతలు దక్కడం గౌరవంగా ఉందన్నారు వర్గీస్​.

“అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్​, ఉపాధ్యక్ష ఎన్నిక విజేత కమలా హారిస్​ ప్రమాణస్వీకార వేడుకలను దగ్గరుండి ఏర్పాట్లు చేయడం ఎంతో గౌరవంగా ఉంది. ఓవైపు అమెరికన్ల ఆరోగ్యం, భద్రత రక్షణ పట్ల వారికున్న నిబద్ధతను దృష్టిలో పెట్టుకునే.. దేశ శక్తిని చాటి చెప్పేందుకు ఇది ఓ మంచి వేదిక.”

— మజు వర్గీస్​, పీఐసీ ఎగ్జిక్యూటివ్​ డైరక్టర్​.

బైడెన్​ ప్రైమరీస్​లో మజు వర్గీస్​.. చీఫ్​ ఆపరేటింగ్​ ఆఫీసర్​, సీనియర్​ సలహాదారుగానూ సేవలందించారు. ఆ సమయంలో రోజువారీ ప్రచారాల కార్యకలాపాలను దగ్గరుండి చూసుకున్నారు వర్గీస్​.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This